12-05-2025 03:00:00 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): పదవులు, రాజకీయాల కోసం ఈటల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ కావాంటే ఆ పార్టీ అధిష్ఠాన కాలుపట్టుకోవాలని, కానీ సీఎం రేవంత్‌రెడ్డిని బూతులు తిడితే మాత్రం సహించేది లేదని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఒక మర్యాదస్తుడని అనుకున్నామని, కానీ, ఆయనకు మతిస్థిమితం తప్పిందన్నారు. సీఎంను పట్టుకొని శాడిస్టు, సైకో అని మాట్లాడటం సరికాదని, తమకు అంతకంటే మాటలు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆది మండిపడ్డారు.