calender_icon.png 15 May, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం తప్పదు

12-05-2025 02:57:51 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంపై ప్రధాని మోదీ ప్రభు త్వం గట్టి సమాధానం ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. పాక్ ఇందు కు తగిన గుణపాఠం అనుభవించక తప్పదని ఆయన హెచ్చరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం తో కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. మరోసారి ద్రోహం చేస్తూ దాడులకు పాకిస్థాన్ పాల్పడిందని ఆదివారం ఒక ప్రకటనలో ఆ రోపించారు. ఆ దేశం లో ఉన్న జైషే -మహమ్మద్, లష్కరే -తొయిబా వం టి ఉగ్రవాద సంస్థల లాంచ్ ప్యా డ్‌లను భారత సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ప్రధాని మోదీ, భారత సైన్యానికి మద్దతుగా నిలిచాయని, అలాగే ఎన్‌డీఏ ప్రభు త్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కూ డా ఇచ్చిందని పేర్కొన్నారు. దేశ భూభాగ సమగ్రతను కాపాడటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని స్ప ష్టం చేశారు.