1 September, 2026 | 1:51 AM

గూరకొండలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శ్రీకారం

01-09-2026 12:19 AM

దేవరకద్ర: గూరకొండ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.4 లక్షల ప్రొసీడింగ్స్ అందజేసి భూమిపూజ చేశారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.