జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని వినతి
మంచిర్యాల టౌన్, ఆగస్టు 31 : జీఓ 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఎస్ బీ టీ ఈ టీ లోనే కొనసాగించాలనీ బీఆర్‌ఎస్వీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుల మధుకుమార్ లు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఎస్ బీ టీ ఈ టీ పరిధి నుంచి మార్చేలా ఉన్న జీ ఓ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలని, ఎలాంటి హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ వి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఆడెపు అరుణ్ కుమార్, జిల్లా నాయకులు సాజిద్ చోటు, శ్రీకాంత్, సుమంత్, సంపత్, జీలకర మహేష్, బెల్లం అరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.






