1 September, 2026 | 1:43 AM

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి

01-09-2026 12:17 AM

బెజ్జూర్(విజయక్రాంతి): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో మూడవ వారం ప్రజావాణి కార్యక్రమంలో 14 ఫిర్యాదులు వచ్చినట్లు నోడల్ అధికారి బండారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు హాజరు అయినట్లు పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, సర్పంచుల నుండి 14 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల వారికి పంపించి సమస్యలను పరిష్కరించేందుకు ఉన్న అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు.