ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్
06-03-2026 01:44 AM
పటాన్‌చెరు, మార్చి 5: రంజాన్ పవిత్ర మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు హిందూ ము స్లింల ఐక్యతకు ప్రతీకలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్ ఎంఐజి ఫేజ్ 1లో గల మసీదే మహమ్మదీయా లో ఏర్పాటు చేసిన ఇస్తారు విందుకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో ఈ నెల 13 న నియోజకవర్గస్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ఎండి మెహబూబ్, మొయిన్, పరమేష్ యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.




