నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి
జగదేవపూర్, మార్చి 5: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో ఇందిర నిర్మాణ పనులను పరిశీలించారు. నూతనంగా మంజూరైనా సరదాగాని సంపతి, పో చయ్య ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గ్రామంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం వహించరాదని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇల్లు పూర్తయిన వాటిని త్వరలోనే గృహప్రవేశం కార్యక్రమం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాజా మోహినిద్దీన్, సర్పంచ్ రజిత పరాశురాం ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నరేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బిక్షపతి, నాయకులు రాజు, మహేష్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.




