18 April, 2026 | 3:20 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఉదారత

02-07-2025 01:14 AM

-కొడకంచి అంగన్ వాడి కేంద్రానికి రూ.లక్ష 

-జిన్నారం ఎస్టీ గురుకుల పాఠశాల మౌలిక వసతులకు రూ.87 వేలు

-కొర్లకుంట చిత్తారమ్మ ఆలయ నిర్మాణానికి రూ.2 లక్షల  విరాళం

-త్వరలోనే రూ.28 లక్షల  సొంత నిధులతో చిత్తారమ్మ ఆలయ పనులు పూర్తి

పటాన్ చెరు, జులై 1: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.  జిన్నారం మండలం కొర్లకుంట గ్రామంలో నిర్మిస్తున్న చిత్తారమ్మ దేవాలయానికి గతంలో రూ.26 లక్షల సొంత నిధులు అందించగా మిగిలిన పనుల కోసం మంగళవారం మరో రెండు లక్షల రూపాయలు అందించారు.

అలాగే జిన్నారంలో నిర్మిస్తున్న శివాజీ స్టేడియం బోర్డ్ ఏర్పాటు కోసం రూ .37 వేలు, జిన్నారం పరిధిలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో మంచి నీటి పైపులైన్లు, ఎర్తింగ్ పనుల కోసం రూ.90 వేలు పటాన్ చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచులు జనార్ధన్, శివరాజ్, ఆంజనేయులు సమక్షంలో మంగళవారం సాయంత్రం సంబంధిత ప్రతినిధులకు డబ్బులను అందజేశారు.

కొడకంచి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడి సెంటర్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే ఆగస్టు నెలలో వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్  మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, బండి శంకర్ పాల్గొన్నారు.