02-07-2025 01:13:38 AM
ఎల్బీనగర్, జూలై 1 : సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా రాచకొండ పోలీసులు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృ షి చేస్తున్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజా యి, డ్రగ్స్ విక్రయాలను అడ్డుకోవాలంటే.. ముందుగా వాటి మూలాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిరంతర తనిఖీలు, నిఘా పెడుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగి స్తూ గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ము ఠాలను అడ్డుకుంటున్నారు. అవసరమైతే ఆ యా రాష్ట్రాలకు వెళ్లి సరఫరాదారులను అ రెస్టు చేసి, కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఏపీ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి...
ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పంపించడానికి అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రాజమార్గం గా మారింది. దీంతో రాచకొండ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లను అష్టదిగ్భంధం చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, నా ర్కోటిక్ బృందాలు స్థానిక పోలీసుల సా యంతో గంజాయి తరలింపు ముఠాల ఆటకట్టిస్తున్నారు.
మేడ్చల్, మల్కాజిగిరి, ఎల్బీన గర్, మహేశ్వరం ఎస్వోటీ బృందాలు విస్తృ త తనిఖీలతో గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలను పట్టుకుంటున్నారు. ఇటీవల భారీ స్థాయిలో గంజాయి, హష్ ఆయిల్, ఇతర నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల పట్టుబడిన ఘటనలు
జూన్ 20న ఎల్బీనగర్ ఎస్వోటీ, హయ త్ నగర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి, రూ, 50 లక్షల విలువైన 166 కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన నిందితులు గంజాయిని ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి సేకరించారు. ఒడిశాలో సేకరించిన గంజాయిని మ హారాష్ట్రలో విక్రయించడానికి హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డును వినియోగించుకున్నారు.
గంజాయి చాక్లెట్లు,గుట్కా ప్యాకెట్ల పట్టివేత
జూన్ 11న హయత్‌నగర్ పోలీసులు, ఎ ల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంజాయి చాక్లెట్లు, వివిధ రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నా రు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ స బ్స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద కేసు న మోదు చేశారు.
పెద్ద అంబర్ పేట్ ఓఆర్‌ఆర్ వద్ద
జూన్ 11న ఎల్బీనగర్ ఎస్వోటీ, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా ఆపరే షన్ నిర్వహించి, పెద్ద అంబర్ పేట్ ఓఆర్‌ఆర్ వద్ద రూ.1.2 కోట్ల విలువైన 20 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి హాష్ ఆయిల్ను కొనుగోలు చేసి, హైదరాబాద్ ద్వా రా బెంగళూరుకు రవాణా చేయడానికి పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వస్తున్నారు. 1 కిలో హాష్ ఆయిల్ తయారీకి సుమారు 35 నుంచి 40 కిలోల గంజాయిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
తుపాకులు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
మే 29న దేశీయ ఆయుధాలను ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ పో లీసులు అరెస్టు చేశారు. యూపీ లోని రాం పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన జీషా న్, అమీర్ బాలాపూర్ లో మంగళి షాపు ని ర్వహిస్తూ దేశీయ ఆయుధాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి
గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వివిధ సమావేశాల్లో రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలి పారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాజస్థాన్, ఒడిశా, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు గంజాయి రవాణా అవుతుంది.
నిరంతరం నిఘా, గస్తీ పెట్టి గంజాయి రవాణా ను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నాం. గతంలో నిందితులు ఇచ్చిన సమాచారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గంజా యి సరఫరాను అడ్డుకుంటున్నాం. ప్రతి ఒక్క రూ గంజాయి రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి.
రాచకొండ సీపీసుధీర్‌బాబు