6 May, 2026 | 3:32 AM

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

06-05-2026 02:10 AM

అశ్వాపురం, మే 5 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అశ్వాపురం మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సుమారు లక్ష రూపాయల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవసరమైన సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించే ఆర్థిక సహాయం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.