13 July, 2026 | 9:57 PM

Breaking News

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •  

హైకోర్డు తీర్పును స్వాగ‌తిస్తున్నాం

09-09-2024 03:10 PM

హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త ఫిటీష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త అప్లికేష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంపపెట్టన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టే విధంగా ఉందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు తప్పవన్నారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు త‌థ్యమని హరీశ్ రావు చెప్పారు.  హైకోర్డు తీర్పు కు అనుగుణంగా రాష్ట్ర శాస‌న‌స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.