calender_icon.png 23 July, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా సంఘం అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

23-07-2025 12:38:29 AM

ఎల్లారెడ్డి జులై 22,(విజయ క్రాంతి): ఇటీవల ఎల్లారెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షునిగా ఖోల రాములు నాయకును ఏకగ్రీవ ఎన్నుకోవడంతో మంగళవారం ఎల్లారెడ్డి స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ రావు హైదరాబాదులోని తన నివాసంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో  ఎల్లారెడ్డి బంజారా సంఘం నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు మర్యాదపూర్వకంగా కలిసి  శాలువలతో సన్మానించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆల్ ఇండియా బంజర సేవా సంఘం మండల అధ్యక్షులు కోల రాములు నాయక్ ను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శాలువులతో  సన్మానించారు. ఈ సందర్భంగా బంజారా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత పాలకులు బంజారా నాయకులను ఎవరు పట్టించుకోలేదని తమకు బంజారా కమిటీ హాల్లో ఫంక్షన్ హాల్ కు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  ఎల్లారెడ్డి బంజారా నాయకులకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఉపాధ్యక్షులు లాల్ సింగ్, పూల్ సింగ్, పుల్యా నాయక్,బంజారా యూత్ అధ్యక్షులు గణేష్, నాయకులు చందర్, ధన్ సింగ్, అంబ్రియ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.