23-07-2025 12:37:51 AM
నిర్మల్, జూలై 22 (విజయక్రాంతి): వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నంది రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఎరువుల కోరుతా నివసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిమాం డ్లతో కూడిన ప్రతిపత్రాన్ని అందించారు. ఉమ్మడి జిల్లాలో యూరియా డిఎపి ఎరువులు రైతులకు సకాలంలో అందించకపోవ డంతో పంటలు కోల్పోయే అవకాశం ఉంద ని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోరుమియా శంకర్ రాజు తిరుపతి పాల్గొన్నారు