23-07-2025 12:39:10 AM
బోథ్, జూలై ౨2 (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలోని పొచ్చర క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్త్స్ర శ్రీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం కారులో మల్యాల శశికాంత్ అనే యువకుడుతో పాటు మరో యువతి ప్రయాణిస్తున్నారు.
కారు అతివేగంగా వెళ్లడంతో పల్టీ కొట్టగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మల్యాల శశికాంత్ మరణించగా, యువతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు ఎస్త్స్ర శ్రీ సాయి పేర్కొన్నారు. కారును అతివేగంగా అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.