calender_icon.png 18 January, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జ్

18-01-2026 08:48:41 PM

దుబ్బాక: అక్బర్‌పేట-భూంపల్లి మండలం కూడవెల్లిలోని దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం మాఘమాస అమావాస్య రోజు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా జరిగే జాతర ఇక్కడి ఆనవాయితీ అని పేర్కొన్నారు.

వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, మాండవ్య నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని తెలిపారు. జాతర ముగిసే వరకు ఆలయ ప్రాంగణంలో ఏలాంటి అవాంతరాలు జరగకుండా బందోబస్తి నిర్వహిస్తున్న పోలీసులకు, పకడ్బందీగా ఉత్సవాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ చైర్మన్ ఉషయ్య రాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.