10 April, 2026 | 1:35 AM

పెండ్లి పాకలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

10-04-2026 12:00 AM

దేవరకొండ (కొండ మల్లేపల్లి) ఏప్రిల్ 9 : కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లకు సరైన ధర లభించేందుకు ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కట్టుబడి ఉన్నాయన్నారు. 

మధ్యవర్తల ద్వారా రైతులు నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకోవడం వల్ల రైతులకు అధిక లాభం చేకూరుతుందన్నారు. రైతులు తమ పంటను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.