పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
21-05-2026 02:07 AM
మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాజన పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ బుధవారం ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్తులంతా సమిష్టిగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.






