పేదల కళ్లలో ఆనందమే ఎమ్మెల్యే పద్మావతి లక్ష్యం
వెంకటనారాయణ
కోదాడ, ఆగస్టు 9 :పేద ప్రజల కళ్లలో ఆనందం చూడటమే కోదాడ ఎమ్మెల్యే ప ద్మావతి రెడ్డి జీవితాశయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షే మ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నా యకుడు రాయపూడి వెంకట్నారాయణ అ న్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేపట్టిన సందర్భంగా ఆదివారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పద్మావతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
పేదల సొం తింటి కలను సాకారం చేసే దిశగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేపట్టడం అభినందనీయమన్నారు.ఈ నెల 15న పద్మావతి రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపి ణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదలు, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడం అభినందనీయమన్నారు.
తెలంగా ణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై పడకుండా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నాగార్జునసాగర్లో మహా వరుణయాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శన మన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రె స్ నాయకులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.






