21 May, 2026 | 3:10 AM

మానుకోట జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబంది

21-05-2026 02:08 AM

మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): అసాంఘిక శక్తుల ఆట కట్టించేం దుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ స్వీయ నేతృత్వంలో మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా నెల్లికుదురులో 2 కిలోల 395 గ్రా ముల గంజాయి స్వాధీనం చేసుకుని, ముగ్గు రు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో భారీ నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడం, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టులు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్ల పరిధిలో కలిపి మొత్తం 3,485 వాహనాలను తనిఖీ చేశారు.

మహబూబాబాద్ సబ్-డివిజన్ పరిధిలో డిఎస్పీ, 4 సీఐలు, 18 ఎస్.ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందితో 1985 వాహనాలను తనిఖీ చేయగా, నంబ ర్ ప్లేట్లు లేని 74 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే తొర్రూ రు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక నాకాబందీలో 12 మంది ఎస్త్స్రలు, నలుగురు సీఐలు, డీఎస్పీ పాల్గొని 1500 వాహనాలను తనిఖీ చేశారు. ఈ నాకాబందీ సందర్భంగా నెల్లికుదురు ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో ఒక కారులో సుమారు 2.395 కిలోల గంజా యి పట్టుబడింది.

ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, గంజాయి తరలింపుకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సం దర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా మహబూబాబాద్ పట్టణంలోని మూడు కోట్ల సెంటర్, ధరణి హాస్పిటల్ సమీపంలోని నాకాబందీ పాయింట్లను పరిశీలించి విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 8712656999, అత్యవసర సహాయం కోసం డయల్ 100 చేయాలని కోరారు.