10 August, 2026 | 1:28 AM

సూర్యక్షేత్రంలో సౌర హోమం, పూజలు

10-08-2026 12:12 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు 9: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాది క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెల్లవారుజామున ఉషాపద్మినిఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి,అభిషేకాలు జరిపారు.మధ్యాహ్నం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.

అనంతరం అన్న ప్రసాద సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్ స్వామి,గణపురం నరేష్,ఉప్పల రాజేష్,అర్చకులు భీంపాండే,భక్తులు తదితరులు పాల్గొన్నారు.