9 August, 2026 | 9:28 AM

అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

09-08-2026 08:15 AM

ములకలపల్లి,ఆగస్టు 8 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం ధర్మన్న నగర్ గిరిజన గొత్తికోయ నివాస ప్రాంతంలో డైనాటా సంస్థ సి ఎస్ ఆర్ నిధులు, సమారిటన్స్ – ఫర్ ది నేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటెయినర్ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం అశ్వారావుపేట నియోజకవర్గ  ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వందన గౌడ్ డైనటా ఎన్జీవో సభ్యులతో కలిసి అత్యంత ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు ప్రాథమిక విద్య, పౌష్టికాహారం,సరైన సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఈ ఆధునిక కంటెయినర్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సి ఎస్ ఆర్  నిధులతో ముందుకు వచ్చిన డైనాటా సంస్థకు, సమారిటన్స్ ఎన్జీవో సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా రవి ,మాజీ ZPTC బత్తుల అంజి ,మాజీ సర్పంచ్ కారం సుధీర్,యూత్ కాంగ్రెస్ నాయకులు సుమిత్ ,వంశీ, సేవాదళ్ నాయకులు తిరపతి రెడ్డి, ఐసిడిఎస్ పిడి,సీడీపీఓ తదితరులు పాల్గొన్నారు.