9 August, 2026 | 9:28 AM

కామారెడ్డి విండో చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి

09-08-2026 08:26 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసిన చైర్మన్, డైరెక్టర్లు,

కామారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): కామారెడ్డి సింగిల్ విండో చైర్మన్ గా గూడెం గ్రామానికి చెందిన చిందల శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. శనివారం హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ ని మర్యాదపూర్వకంగా కలిసి సొసైటీ చైర్మన్ గా నియమించినందుకు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజగౌడ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, రాజు, విండో డైరెక్టర్లు కుమార్ గౌడ్, పెద్ద పోతున్న గారి రాజేష్, సీతారాం నాయక్, రమేష్ నాయక్, రమేష్, వెంకటేశ్వర్, సాయిలు, లింగం, తదితరులు పాల్గొన్నారు.