9 August, 2026 | 9:28 AM

అంతర్‌జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్ట్

09-08-2026 08:21 AM

బైక్‌లు స్వాధీనం

సదాశివనగర్, ఆగస్ట్ 08(విజయక్రాంతి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన హనుమంత్ రాజు తన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ నం. TS-08-HY-8176ను గత నెల 24 రాత్రి తన ఇంటి ముందు పార్క్ చేయగా, మరుసటి రోజు మోటార్ సైకిల్ కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ గారి పర్యవేక్షణలో, సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో, సదాశివనగర్ ఎస్‌ఐ పుష్పరాజ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు తదితర అంశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు దర్యాప్తులో A1 షేక్ ఇమ్రాన్, A2 అద్నాన్ ఖాన్, A4 సయ్యద్ జుబేర్, A5 షేక్ అయాన్, A6 సచిన్ విశ్వనాథ్ ఖండేవాల్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను దొంగిలిస్తున్నట్లు వెల్లడైంది.A1 ఇమ్రాన్, A2 అద్నాన్ ఖాన్‌లు A2కు చెందిన TVS Rider TG-16-0674పై తిరుగుతూ హోటళ్లు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను గుర్తించేవారు. అనుకూలమైన వాహనాలను గుర్తించిన అనంతరం వాటిని దొంగిలించి A4, A5, A6లకు తక్కువ ధరలకు విక్రయించేవారు.దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన A4, A5, A6లు వాటి అసలు నంబర్ ప్లేట్లను తొలగించి,నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చుకుని పోలీసులకు అనుమానం రాకుండా వినియోగించేవారు.

అనంతరం వాటిని అధిక ధరకు విక్రయించి అక్రమంగా లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.సదాశివనగర్‌లో హనుమంత్ రాజుకు చెందిన Bajaj Pulsar TS-08-HY-8176ను A1 ఇమ్రాన్, A2 అద్నాన్ ఖాన్‌లు దొంగిలించి A6 సచిన్‌కు రూ.7,000లకు విక్రయించినట్లు వెల్లడైంది. A6 సచిన్ అసలు నంబర్ ప్లేట్‌ను తొలగించి MH-26-CB-1576 నకిలీ నంబర్ ప్లేట్‌ను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.శనివారం పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. A4 జుబేర్, A5 అయాన్, A6 సచిన్‌లు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చిన దొంగిలించిన పల్సర్ మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తుండగా, A1 ఇమ్రాన్, A2 అద్నాన్ ఖాన్‌లు మరో మోటార్ సైకిల్‌ను దొంగిలించి హైదరాబాద్‌లో విక్రయించాలనే ఉద్దేశంతో TVS Riderపై వెళ్తున్నారు.

పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించిన A1, A2లు తప్పించుకునేందుకు యూ-టర్న్ తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిగతా నిందితులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల వద్ద నుండి మొత్తం 4 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా, నిందితులు పరస్పరం సంప్రదించేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్‌జిల్లా స్థాయిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, దొంగిలించిన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ, సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, ఎస్‌ఐ పుష్పరాజ్ మరియు సిద్ధిఖీ సిబ్బందిMD అజహర్ ఫరూక్, ARPC శంకర్, CCS Teamకు చెందిన రవి, గణపతిలు  జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర  అభినందించారు.