22 April, 2026 | 9:38 PM

పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

22-04-2026 08:37 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి పదవీవిరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయులు మద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, తెలుగు ఉపాధ్యాయురాలు దగ్గుల సుజాత (SA తెలుగు)ల సేవలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పదవీవిరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుని విద్యారంగ అభివృద్ధికి వారు అందించిన సేవలు ఆదర్శప్రాయమని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని తమ పదవీకాలంలో అనేక మంది విద్యార్థులను మంచి మార్గంలో నడిపించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి స్మారక చిహ్నాలను అందజేశారు.  మిగిలిన జీవితం ఆరోగ్యంతో ఆనందంతో గడపాలని ఆకాంక్షించారు.