22 April, 2026 | 9:59 PM

ఇల్లందు డిపోలో ఆర్టీసీ జేఏసి సమ్మె సక్సెస్

22-04-2026 08:39 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు ఆర్టీసీ కార్మికులు బస్ డిపోలో బుధవారం సమ్మె విజయ వంతం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు సిఐ భారీ బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసి సమ్మె నేపథ్యంలో టెంట్ వేసి సమ్మె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జరిగిన సభలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో హమీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యూనియన్లను పునరుద్ధరించాలి.

యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, పీ ఆర్సీ 2021-2025 చెల్లించాలని, 2017 వేతన సవరణ ఏరియర్స్ చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కి ఇవ్వాలని తదితర డిమాండ్స్ తో తల పెట్టిన జే ఏ సీ సమ్మె కు స్టాఫ్ అండ్ ఫెడరేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో ఐ వీలు జే ఏ సీ కన్వీనర్ ఖలీల్ పాషా, కో కన్వీనర్ డీ అంజయ్య, పీ ఎల్ రావు, పీ కృష్ణ, సైదమ్మ, ఉపేంద్ర, హనుమ, మహేశ్వరి, తాళ్లూరి కృష్ణ, మోహన్ రావు పాల్గొన్నారు.