వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కమలాకర్
15-05-2026 12:32 AM
కొత్తపల్లి, మే 14(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చిం తకుంటలో గల వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున కరీంనగర్ ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్ సందర్శించా రు. ఈ సందర్బంగా మాట్లడుతూ రైతులను ఇబ్బంది పెట్టకుండావెంట వెంటనే ధాన్యా న్ని కొనుగోలు చేయాలనీ అధికారులను అ దేశించారు.
స్థానిక కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, నాయకులు కసారపు శ్రీనివాస్, పిల్లి మహేష్, గుర్రాల జయప్రకాష్ రెడ్డి, తిరుపతి నాయక్, సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, చంద్ పాషా, చిట్టపెల్లి నరేందర్ పాల్గొన్నారు.






