14 July, 2026 | 11:21 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఇంధనం పొదుపు దిశగా సర్కార్

15-05-2026 12:31 AM

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తగ్గింపు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంధనం కొరత నేపథ్యంలో వాడకం తగ్గించాలని ఇటీవల ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  సీఎం వో సైతం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దూర ప్రాంతాలకు మినహా సిటీలో రెండు, మూడు వాహనాలతోనే సీఎం కాన్వాయ్ వెళుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మరోసారి సీఎం కాన్వాయ్ తగ్గింపు అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం. దీంతో సిటీ బయటకు వెళ్లినా కాన్వాయ్ తగ్గిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కాన్వా య్ మాత్రమే కాకుండా మంత్రుల కాన్వా య్ కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

కేవలం తెలంగాణ ప్రభుత్వమే కా కుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఢిల్లీలో సీఎం కాన్వాయ్ నుంచి 60 శాతం వాహనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో వారం రోజుల పాటు ఉద్యో గులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సైతం నిర్ణయించారు.