తడికలపూడి, తావుర్యతండా గ్రామ పంచాయతీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం తడికలపూడి, తావుర్య తండా పంచాయతీల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పర్యటించారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లు, బీ టి రోడ్డు లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణ పనులను, పూర్తి అయిన ఇండ్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం మంజూరు చేయబోతుందని, నిజమైన పేదవాళ్ళను అర్హులుగా ఎంపిక చేయాలని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేయాలని అధికారులకు, నాయకులకు పలు సూచనలు చేసారు. నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇంటికి స్వయంగా ఎమ్మెల్యే నీళ్ల పైపుతో క్యూరింగ్ చేస్తూ యజమానికి పలు సూచనలు చేసారు. ఎమ్మెల్యే స్వయానా నాణ్యత పనులు, గ్రామంలోని సమస్యలను ప్రజల వద్దకే వచ్చి తెలుసుకోటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






