1 June, 2026 | 2:57 PM

Breaking News

అన్నింటిపై సోషల్ మీడియా ప్రభావం   •   పవన్ క్షమాపణలు చెప్పిన తర్వాతే.. సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా   •   ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల విషయం   •   బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •  

నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

01-06-2026 01:55 PM

జిల్లా యస్పి  డి.జానకి 

మహబూబ్ నగర్ క్రైం : జిల్లా వ్యాప్తంగా(Mahabubnagar district) జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861(Police Act ) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ  డి.జానకి(Mahabubnagar SP D. Janaki) ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.