6 June, 2026 | 5:46 PM

Breaking News

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •   ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి   •  

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి

07-04-2026 03:16 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవ లక్ష్మి హాజరై 64 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు.

ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతున్నదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు అదనంగా తులం బంగారం లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వాంకిడి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు  లబ్ధిదారులు పాల్గొన్నారు.