10 March, 2026 | 4:16 PM

యర్రవరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

09-03-2026 06:46 PM

సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు

కోదాడ: మండల పరిధిలోని యర్రవరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల పరిధిలోని యర్రవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొన మహిళ అధికారులకు ప్రజా ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం గ్రామ సమస్యలను గ్రామ నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.