18 July, 2026 | 3:02 PM

Breaking News

వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •  

వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

18-07-2026 03:02 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): వట్టివాగు ప్రాజెక్టును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవ లక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన ఆమె, వట్టివాగు కెనాల్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేసి వరి సాగు చేస్తున్న రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం నమోదవుతున్న వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల సింగిల్ విండో చైర్మన్ సంజీవ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.