18 July, 2026 | 2:53 PM

బీజేపీతో దేశానికి ప్రమాదం

18-07-2026 02:53 PM

ఏకపక్ష నిర్ణయాలతో దేశానికి నష్టం చేస్తున్నారు 

బీజేపీపై పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ 

ధర్మపురి,జూలై18(విజయక్రాంతి): బీజేపీతో దేశానికే ప్రమాదం ఉందనీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పార్లమెంట్ లో ఏకపక్ష నిర్ణయాలతో అన్నీ వర్గాలకు నష్టం వాటిల్లే బిల్లులు ప్రవేశ పెడుతున్నారనీ ధ్వజం ఎత్తారు. యూరియా ఆప్ తో రైతులకు తీరనీ అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనీ,కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ ప్రజల్లో గుర్తుంపు వస్తుందేమోనన్న భయాందోళనలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత భయమో తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి అడ్డుపడుతున్నారనీ బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, గుండాటి సందీప్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు,నాయకులు బందేల ఉదేయ్ గౌడ్,నక్క సురేష్,గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.