పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!
కూసుమంచి, జులై 18(విజయక్రాంతి): పచ్చని చేలల్లో వరి నాట్లు వేస్తూ.. పల్లె ప్రగతికి ప్రాణం పోస్తున్న శ్రమజీవుల చెంతకు పాలేరు ఆత్మీయ బంధువు కదిలివచ్చారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా మల్లాయిగూడెం ముగించుకుని మార్గమధ్యంలోని లింగారం తండా, జుజ్జులరావ్ పేట గ్రామ శివార్ల మీదుగా కోక్యా తండాకు వెళ్తున్న క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అక్కడ శ్రమిస్తున్న మహిళా కూలీలను చూసి తన కాన్వాయ్‌ను ఆపి వాహనం దిగారు. హోదాల సరిహద్దులు వీడి, నిరాడంబరంగా నేరుగా ఆ పల్లె పడతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను, అవసరాలను ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి పేదవారికి రాజకీయం లేని 'ఇందిరమ్మ ఇళ్ల' వెలుగులు అందిస్తామని, ఉచిత కరెంట్, సంక్షేమ పథకాల తోడుంటామని ఆయన ఇచ్చిన భరోసా, ఆ పల్లె జనాల ముఖాల్లో కొండంత ఆనందాన్ని, కొత్త నమ్మకాన్ని నింపింది.






