18 July, 2026 | 2:59 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •   ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం.. రైతుల ఆవేదన   •  

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్

18-07-2026 02:59 PM

  1. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెంచేలా విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమన్నారు. ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రీ-ప్రైమరీ ప్రవేశాలు, విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజనం, పాఠశాలల పరిశుభ్రత, ఉపాధ్యాయుల హాజరు, కేజీబీవీల నిర్వహణ తదితర అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. విద్యా నాణ్యతను పెంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.