3 March, 2026 | 4:13 PM

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

03-03-2026 12:00 AM

చిట్యాల, మార్చి 2 :  రామన్నపేట మండల పరిధిలో పలు గ్రామాలలో  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం శంకుస్థాపనలు చేశారు. నీర్నేముల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు మరియు సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధాన్ పల్లి గ్రామంలో సి.సి రోడ్డు మరియు మహిళా సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కొమ్మాయిగూడెం గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రామన్నపేట మండల కేంద్రంలో నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మించడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.