17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఘనంగా శ్రీపాదరావు జయంతి

03-03-2026 12:00 AM

సూర్యాపేట, మార్చి 2 (విజయక్రాంతి) : దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతినీ కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, డీవైఎస్‌ఓ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, డిఎంహెచ్వో వెంకటరమణ, డిఎమ్‌ఓ నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.