14 April, 2026 | 8:23 PM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

14-04-2026 04:45 PM

మండల పోచారం గ్రామం నుండి మండల కేంద్రం వరకు భారీ ర్యాలీ

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం గ్రామం నుండి మండల కేంద్రం వరకు మండల దళిత సంఘం, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దాంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు విజయవంతం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, పలువురు నాయకులు మాట్లాడుతూ...అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి చేశాడని తెలిపారు.

చిన్న వయసులోనే కుల వివక్షతను ఎదుర్కొన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలనతోనే వివక్ష అంతమై ఆత్మగౌరవంతో జీవిస్తారన్నారు. రాజ్యాంగ శిల్పగా, స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆర్థికవేత్తగా దేశానికి అపర సేవలు అందించారని పేర్కొన్నారు.కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య సాధించి అరుదైన గౌరవం పొందారన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేశారని వివరించారు.సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అనగారిన వర్గాలకు సమాన న్యాయం కలిగించాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారన్నారు.

ప్రజలంతా మొదట విద్యావంతులైతేనే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మి ఆదిశగా కృషిచేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. స్వేచ్ఛ సమానత్వం,సబ్రాత్రుత్వం అందరికీ దక్కేలా రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులతోనే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్పష్టం చేశారు.సమాజంలో ప్రతి ఒక్కరు కులమత అసమానతలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని అంబేద్కర్ కలలు గన్నారన్నారు.నేడు ఆకలలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు.ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కోరారు.