14 April, 2026 | 8:30 PM

లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి

14-04-2026 04:47 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను మనువాదుల నుంచి పరిరక్షించుకోవాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు తెలిపారు. మంగళవారం మండల కేంద్రములో బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలల వేసి ‌ఘనంగా నివాళులు అర్పించారు‌.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బడుగు బలహీన, అట్టడుగు వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించి దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తన జీవితం మొత్తం దేశ ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. భారత రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలన్నారు. లౌకిక వాద ప్రజాస్వామ్యా హక్కుల పరిరక్షణ కై పోరాలు ఉదృతంగా నిర్వహిస్తామని చెప్పారు.