1 July, 2026 | 8:12 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

ఎమ్మెల్యే మాగంటికి అస్వస్థత

06-06-2025 01:17 AM
  1. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స 
  2. విషమంగానే ఎమ్మెల్యే గోపినాథ్ పరిస్థితి
  3. ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు
  4. 48 గంటలపాటు డాక్టర్ల పర్యవేక్షణలో: హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపినాథ్ బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే గుండోపోటుకు గురైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మాగంటి ఐసీయూలో ఉన్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని హరీశ్‌రావు తెలిపారు. ౪౮ గంటలపాటు వైద్యుల నిరంతరాయంగా వైద్యుల పరిశీనలో ఎమ్మెల్యే గోపినాథ్ ఉంటారని చెప్పారు.