1 July, 2026 | 7:10 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

మహిళలకు జీవనోపాధి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

06-06-2025 01:17 AM

- పెద్దపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): మహిళలకు జీవనోపాధి కల్పించడంకోసం రాష్ట్ర ప్రభుత్వం, లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి గ్రూ పుకి కేటాయించిన క్యాంటిన్ ను ఆసుపత్రి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో ఇందిరా మహి ళా శక్తి పధకం ద్వారా ఆసుపత్రి కి వచ్చి వెళ్లే ప్రజల కోసం, రోగుల కోసం ప్రభుత్వ ప్రోత్సహంతొని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళా క్యాం టిన్ ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పధకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.

మహిళా గ్రూపుల ద్వారా మహిళలకు సేవా చేసే అవకాశం రావడం చాలా గర్వకారణంమని, అందరి సహకారంతో ఈ మహిళా క్యాంటిన్ ముందు ముందు కూడా మంచి పురోగతి సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, నుగుల్లా మల్లయ్య, భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఉప్పు రాజు, బొంకురి అవినాష్, జెడల సురేందర్, దొడ్డుపల్లి జెగదీష్, తూముల సుభాష్, గుజ్జుల కుమార్, నమసని శ్రీనివాస్,ఆసుపత్రి జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.