17 August, 2026 | 1:11 AM

బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

17-08-2026 12:39 AM

రామచంద్రాపురం, ఆగస్టు 16 : బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లలో ఏర్పాటు చేసిన గ్రామ దేవతల బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.  స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో  సీనియర్ నాయకులు రాములు గౌడ్, రవీందర్ రెడ్డి, కొమరయ్య, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్యాం రావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇసుకబావి కాలనీలో విగ్రహ ప్రతిష్ట..

బీరంగూడ డివిజన్ పరిధిలోని ఇసుక బావి కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  శ్రీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, శివలింగ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు.

నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం తులసి వనం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. హాజరైన అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జగదీష్, యూనిస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.