17 August, 2026 | 1:18 AM

రంగపేటలో అభివృద్ధి పనులకు భూమి పూజ

17-08-2026 12:39 AM

మానకొండూరు, ఆగస్టు 16( విజయ క్రాంతి):మానకొండూర్ మండలం రంగపేట గ్రా మంలో రూ.1.61 కోట్ల వ్యయంతో గోదాం ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,  గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, ఆదివారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రా మీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ప్రజలకు అవసరమైన రహదారులు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.రంగపేట గ్రామంలో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు, సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, ఊటూరు ప్యాక్స్ చైర్మన్ ముద్దసాని శ్రీనివాసరెడ్డి,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెంచాల కిషన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, పార్టీ నాయకులు బక్కా రెడ్డి,రేమిడి శ్రీనివాస్ రెడ్డి, బండి మల్లేశం, బుర్ర శ్రీకాంత్ గౌడ్, దూలం దేవేంద్ర, కనకం కుమార్, తదితరులు పాల్గొన్నారు.