21 July, 2026 | 11:10 AM

డంపింగ్ యార్డ్ తరలించడానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి కృషి

21-07-2026 12:46 AM
  1. జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య
  2. జవహర్‌నగర్‌లో భారీ పాదయాత్ర                        

జవహర్‌నగర్, జూలై 20 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించడానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మరువలేమని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు.  జవహర్ నగర్  డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో   డంపింగ్ యార్డ్ సమస్యపై జరిగే సన్నాహక అవగాహన సదస్సులో భాగంగా సోమవారం బాలాజీ నగర్ ఫైరింగ్ రేంజ్ నుండి జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీసు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు కమిటీ బిఆర్‌ఎస్  అధ్యక్షుడు కొండల ముదిరాజ్ మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యానికి పర్యావరణానికి పెద్ద ముప్పుగా తయారైందని డంపింగ్ యార్డ్ ను పూర్తిగా తొలగించాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గత ఆరు నెలలుగా కృషి చేస్తున్నారని తెలిపారు.జవహర్ నగర్ ఎత్తివేత పోరాట కమిటీకి తమ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల చైర్మన్ శోభ, జిట్టా శ్రీనివాస్ రెడ్డి, పల్లపు రవి, రామస్వామి, హైమద్, బండకింది  ప్రసాద్, చైర్మన్ షేక్షావలి, కన్వీనర్ ఉమామహేష్, శివన్నారాయణ, తోటపల్లి శంకర్ ,అనురాధ, గడ్డం సదానందం, శివ బాబు, మల్లేష్, జయ, అల్లూరి సావిత్రి, సూర వెంకటయ్య, అరుణ, టి. కాలేశా, చంద్రమౌళి, జాన్, వి. ప్రవీణ్, పెరక సునీత, స్వరూప, లక్ష్మీబాయి, జయసుధ, ఫాతిమా, అంబాల ఎల్లయ్య, మబ్బుబాలు, దుర్గాప్రసాద్ బిఆర్‌ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.