21 July, 2026 | 11:37 AM

బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

21-07-2026 12:48 AM
  1. మాజీ మంత్రి కేటీఆర్
  2. కేటీఆర్‌ను సన్మానించిన బీఆర్‌ఎస్ 
  3. సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు

ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): బాధ్యతాయుతంగా అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ముషీరాబాద్ కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నగర నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు అలీ మస్కతి, జె. శ్రీనివాస్, యాదగిరి, ముప్పిడి నర్సింగ్ రావు తదితరులు కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెన్ శ్రీనివాస రావు సన్మానించి ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను వివరించారు. డివిజన్లలో జరుగుతున్న ప్రక్రియను ఆయనకు వివరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ఆర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీచేసి బీఎల్‌ఓలకు అం దజేయాలన్నారు. పార్టీనాయకులు, కార్యకర్తలు ఎస్‌ఐఆర్ విజయవంతానికి కృషిచేయాలన్నారు.