ప్రతి ఆడబిడ్డకు ఆసరాగా.. కళ్యాణ లక్ష్మి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి,ఆగస్టు 24 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని 97 మంది లబ్ధిదారులకు తుంగతుర్తి మండలంలో 105 మంది మద్దిరాల మండలంలో 43 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ... నిరుపేద కుటుంబానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుపేదలకు ఆసరాగా ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్లు జాన్ మహమ్మద్, మన్ ప్రీతి సింగ్ కంటమయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజి నరేష్, దొంగరి గోవర్ధన్ ముక్కాల అవిలమల్లు డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు పాలకుర్తి రాజయ్య ఉప్పుల రాంబాబు పెద్ద బోయిన అజయ్, గుండ గాని సుధాకర్ మేనేని మాధవరావు, నరసయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






