31 July, 2026 | 3:27 PM

వంద శాతం రైతుల రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

24-08-2024 07:44 PM

గజ్వేల్,ఆగస్టు24: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 100% రైతులకు రుణమాఫీ చేస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని రైతు వేదికలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు రైతుల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదులు తలెత్తిన సాంకేతిక సమస్యల గురించి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడారు. రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం 13వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతు రుణమాఫీలో సాంకేతిక సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో రైతుల వారిగా అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించి రుణమాఫీకి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రుణమాఫీ అందరికీ చేయడం లేదంటూ బీఆర్ఎస్ , బిజెపి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని రైతులు ప్రజలు నమ్మి ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు.

రుణమాఫీ విషయంలో రైతులు ఓపికగా ఉండాలని రెండు లక్షల లోపు రుణమాఫీ అందరి రైతులకు జరుగుతుందన్నారు. రుణమాఫీలో సమస్యలు పరిష్కరించడానికి రైతుల ఇంటికి కూడా వెళ్లి పరిశీలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రైతు వేదికలలో రైతుల సమస్యలను పరిశీలించడంతో పాటు  ఇంటింటికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. వీళ్లంతా త్వరగా రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు. రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, ఏఈఓ లు, రైతులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.