అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామేలు ఆగ్రహం
తుంగతుర్తి, జూన్ 2: తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏమాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే మందుల సామే లు అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవ త్సరాలు కొట్లాడి ఎంతోమంది అమరవీల త్యాగ ఫలితంగా, సోనియా గాంధీ కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకు న్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నియామకాలు ఉ ద్యోగాల కోసమే ప్రత్యేకంగా రాష్ట్రము ఏర్పా టు చేసుకొని అభివృద్ధిలో సాగుతుందన్నా రు. తెలంగాణలో రాష్ట్రంలో లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు ఉన్నప్పటికీ ఐక్యంగా ఉంటూ అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
తెలంగాణతో కోనసీమ ఎండిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంపై ఆయన విషం కక్కడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరన్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని, రాష్ట్రాల విభజనలో చిన్న చిన్న సమస్య లు ఉంటాయని వాటిని పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
నియోజకవర్గంలో రామన్న రోజుల్లో 2500 పైచిలుకు ఇం దిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని, పే ద ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తాసిల్దార్ దయానందం, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి వైస్ చై ర్మన్ వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, నల్లు రామచంద్రారెడ్డి, రామచంద్రయ్య, మాచర్ల అనిల్, గంగరాజు యాదవ్, దాసరి శీను, పోలపాక రామచంద్రు, సుధాకర్ గౌడ్, మహేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






