దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్
07-05-2026 01:57 AM
పంజాగుట్ట,మే 6(విజయక్రాంతి): నిమ్స్‌కు ఎయిర్ కూలర్లను వితరణగా ఇచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నవయువ నిర్మాణ్ ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఆయన రూ.8వేలు విలువ చేసే 7 కూలర్లను ఎన్జీఓ సభ్యులు ఎన్.నరేశ్, దినేశ్, విక్రమ్, మనోహర్, కార్తీక్ ల ద్వారా నిమ్స్ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నవయువ నిర్మాణ్ సంస్థ చేసిన సహాయం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే నవీన్‌కు ధన్యవాదలు తెలియజేశారు.






