7 May, 2026 | 2:31 AM

హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం

07-05-2026 01:55 AM

సికింద్రాబాద్, మే 6 (విజయక్రాంతి): ప్రజావాణికి 4 వారాల పాటు విరామాన్ని హైడ్రా కమి షనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. వేలాదిగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరి ష్కరిస్తున్నామని, మిగిలి ఉన్నవి కూడా క్లియర్ చేసేందుకే 4 వారాలు విరామాన్నిచ్చినట్టు బుధవారం హైడ్రా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్ 8వ తేదీ నుంచి యథావిధిగా హైడ్రా ప్రజావాణి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజావాణితో పాటు.. వివిధ రూపాల్లో వచ్చిన ఫిర్యాదులన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విరామన్ని ప్రకటించినట్టు తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదుదారులు అత్యవసరమని భావిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలవచ్చన్నారు. అలాగే ముఖ్యమైన సమస్యలున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయ వచ్చునని తెలిపారు.